
'పొత్తులపై తొందరపడటం లేదు'
ఎన్నికల పొత్తులపై టీఆర్ఎస్ తొందరపడటం లేదని ఆపార్టీ సీనియర్ నేత వినోద్ అన్నారు.
హైదరాబాద్ : ఎన్నికల పొత్తులపై టీఆర్ఎస్ తొందరపడటం లేదని ఆ పార్టీ సీనియర్ నేత వినోద్ అన్నారు. సీపీఐ కూడా తమతో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపుతోందని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే నిర్ణయం తీసుకుంటామని వినోద్ చెప్పారు.
వలసలతో కొంత ఇబ్బంది ఉంటుందని, అలాంటి నేతలతో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చర్చలు జరుపుతున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌తో పొత్తు లేకుంటే అధికారంలోకి వస్తామా లేక రెండు పార్టీల మధ్య ఓట్లు చీలిపోయి నష్టమేమైనా జరుగుతుందా? అని కేసీఆర్ ఇప్పటికే పార్టీ ముఖ్యులను, జిల్లా స్థాయి నేతలను ఆరా తీస్తున్నారు.