'ఎప్పుడు మాట్లాడదామా అని చూస్తున్నా' | viswakanth ankireddy parents response | Sakshi
Sakshi News home page

'ఎప్పుడు మాట్లాడదామా అని చూస్తున్నా'

Dec 15 2014 9:53 PM | Updated on Aug 24 2018 2:36 PM

'ఎప్పుడు మాట్లాడదామా అని చూస్తున్నా' - Sakshi

'ఎప్పుడు మాట్లాడదామా అని చూస్తున్నా'

ఆస్ట్రేలియాలోని సిడ్నీ కిడ్నాప్ ఉదంతం నుంచి తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విశ్వకాంత్ అంకిరెడ్డి సురక్షితంగా బయపడడంతో ఆయన కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

గుంటూరు: ఆస్ట్రేలియాలోని సిడ్నీ కిడ్నాప్ ఉదంతం నుంచి తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విశ్వకాంత్ అంకిరెడ్డి సురక్షితంగా బయపడడంతో ఆయన కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వార్తా చానళ్లలో ప్రసారమైన దృశ్యాలు చూసి తమ కుమారుడిని విశ్వకాంత్ తల్లిదండ్రులు పోల్చుకున్నారు. సాయుధ బలగాల సాయంతో సిడ్నీ కేఫ్ నుంచి విశ్వకాంత్ బయటకు వస్తున్న దృశ్యాలు చూసి ఊపిరి పీల్చుకున్నారు.

తమ కుమారుడు సురక్షితంగా బయపడతాడన్న నమ్మకం తనకుందని విశ్వకాంత్ తండ్రి 'సాక్షి' టీవీతో చెప్పారు. తన కుమారుడికి ధైర్యం ఎక్కువేనని వెల్లడించారు. తన కుమారుడితో ఎప్పుడు మాట్లాడదామా అని ఎదురు చూస్తున్నట్టు విశ్వకాంత్ తల్లి చెప్పారు. సిడ్నీలో ఉన్న కోడలితో మాట్లాడినట్టు తెలిపారు. తమ కుమారుడితో పాటు బందీలను విడిపించిన సిడ్నీ పోలీసులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. విశ్వకాంత్ క్షేమంగా బయటపడడంతో అతడి తరపు బంధువులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement