
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ బడ్జెట్ సమావేశాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశంసనీయమైన రీతిలో క్రియాశీల పాత్రను నిర్వహించారని రాజ్యసభ సెక్రటేరియట్ వెల్లడించింది. ప్రజా సమస్యల ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో తనకు గల అవకాశాలను రాజ్యసభలోని ఇతర సభ్యుల కన్నా చాలా చక్కగా వినియోగించుకున్నారని బుధవారం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది.
రాజ్యసభలో మొత్తం 323 సందర్భాల్లో వివిధ రూపాల్లో 155 మంది తమ గళాన్ని వినిపిస్తే అందులో 83 మంది రెండు కంటే ఎక్కువ సార్లు చర్చల్లోనూ, ప్రత్యేక సూచనలు ఇచ్చే విషయంలోనూ పాల్గొన్నారు. విజయసాయిరెడ్డి 9 సందర్భాల్లో తన గళాన్ని వినిపించారు. జీరో అవర్ ప్రస్తావన, ప్రత్యేక ప్రస్తావన, ఒక మౌఖిక ప్రశ్న, మౌఖిక ప్రశ్నలకు 4 అనుబంధ ప్రశ్నలు, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, సాధారణ బడ్జెట్‌పై చర్చలో ఆయన మాట్లాడారు. రాజ్యసభ దృష్టికి అనేక సమస్యలు తీసుకురావడంతో పాటుగా నిర్మాణాత్మకమైన సూచనలు చేశారు.