చెట్టును ఢీ కొన్న లారీ: ఇద్దరు మృతి | Two people died in lorry accident | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీ కొన్న లారీ: ఇద్దరు మృతి

Sep 7 2013 8:36 AM | Updated on Sep 1 2017 10:32 PM

జిల్లాలోని పాకాల మండలం నేండ్రగుంట వద్ద ఈ రోజు తెల్లవారుజామున లారీ చెట్టును ఢీ కొట్టింది.

జిల్లాలోని పాకాల మండలం నేండ్రగుంట వద్ద ఈ రోజు తెల్లవారుజామున లారీ చెట్టును ఢీ కొట్టింది. ఆ ఘటనలో డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతులిద్దరి వద్ద లభించిన సమాచారం మేరకు వారు విజయవాడ వాస్తవ్యులుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement