టగ్‌ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ముంబైకి తరలింపు | Sakshi
Sakshi News home page

టగ్‌ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ముంబైకి తరలింపు

Published Sun, Aug 18 2019 11:09 AM

Tug Boat Fire Injured Person Passing To Mumbai - Sakshi

సాక్షి, ద్వారకనగర్‌(విశాఖ దక్షిణం): ఈనెల 13వ తేదీన విశాఖ సాగర తీరానికి మూడు నాటికల్‌ మైళ్ల దూరంలో జరిగిన టగ్‌ ప్రమాద ఘటనలో తీవ్ర గాయాలపాలైన జువిన్‌ జోషి(24)ని మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ ఆదేశాల మేరకు బాధితుడిని ఆదివారం ముంబైలోని ఆస్పత్రికి హెలికాప్టర్‌ ద్వారా తరలించినట్టు జాయింట్‌ కలెక్టర్‌–2 ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తరలింపు బాధ్యతలను జేసీ–2, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి పర్యవేక్షించారు.  
చదవండి: టగ్‌ ఆన్‌ ఫైర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement