
సాక్షి, చిత్తూరు : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తమిళనాడులోని కాంచీపురంలో అత్తివరదరాజ స్వామి దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి వైఎస్సార్‌సీపీ నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా ఇంటికి వెళ్లి ఆతిథ్యం స్వీకరించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కేసీఆర్‌ను రోజా నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు. టీటీడీలో చేపడుతున్న సంస్కరణల గురించి కేసీఆర్‌కు వివరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తెలుగు ప్రజలకు ఎల్లెడలా ఉంటాయని అన్నారు. స్వామి వారి సేవల గురించి కొద్దిసేపు ఇరువురూ చర్చించారు. ‘శ్రీ వెంకటేశ్వర స్వామికి తరతమ బేధాల్లేవు. ఆ దేవదేవుడు అందరివాడు’అని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. సుబ్బారెడ్డితోపాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు కేసీఆర్‌ను కలుసుకున్నారు.
(చదవండి : రాయలసీమ అభివృద్ధికి సహకరిస్తాం : కేసీఆర్)


