రేపు పులివెందులకు వైఎస్‌ జగన్‌ రాక | Tomarrow YS Jagan Visit to Pulivendula YSR kadapa | Sakshi
Sakshi News home page

రేపు పులివెందులకు వైఎస్‌ జగన్‌ రాక

Jan 10 2019 1:21 PM | Updated on Jan 10 2019 1:21 PM

Tomarrow YS Jagan Visit to Pulivendula YSR kadapa - Sakshi

వైఎస్‌ఆర్‌ జిల్లా, పులివెందుల: వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను ముగించుకుని శుక్రవారం పులివెందులకు చేరుకుంటారని కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం అక్కడే బస చేసి.. శుక్రవారం తిరుమలనుంచి పులి వెందులకు బయలుదేరుతారన్నారు.

11న కడప పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారన్నారు. అనంతరం పులివెందులకు చేరుకుని స్థానిక సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనలు చేస్తారన్నారు. తర్వాత ఇడుపులపాయకు చేరుకుని తన తండ్రి, మహానేత వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఘన నివాళులర్పిస్తారన్నారు. 12, 13 తేదీల్లో భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలకు, కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement