సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు, సిబ్బంది చేస్తున్న సమ్మె ఉద్ధృతమవుతోంది.
విజయనగరం మున్సిపాలిటీ: సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు, సిబ్బంది చేస్తున్న సమ్మె ఉద్ధృతమవుతోంది. ఆందోళనలో భాగంగా బుధవారం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మున్సిపల్ కార్యాలయాలను ముట్టడించనున్నారు. మంగళవారం పార్వతీపురంలో కార్మికులు వంటా వార్పు చేసి నిరసన వ్యక్తం చేయగా, బొబ్బిలిలో మోకాళ్లపై నడిచారు. సాలూరు పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉంది. వ్యవసాయ అధికారులు కూడా ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా రూపొందించారు. సాగునీటి వనరులు అందుబాటులో ఉన్న 61,500 హెక్టార్లలో సాగు చేయించేందుకు కార్యాచరణ తయారు చేశారంటే వారికెంత అనుమానాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్ని ఎలా అధిగమించాలి? రైతుల్ని ఎలా సిద్ధం చేయాలి? భవిష్యత్‌లో ఏం చేయాలి? అన్నదానిపై అధికారుల్లో కనీస స్పష్టత లేదు. దీనికంతటికీ వారి మధ్య సమన్వయం లేకపోవడమే ప్రధాన కారణం.
సీజన్‌లో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు అధికారులు ముందుగానే సమాయత్తం కావాలి. సంబంధం ఉన్న శాఖలన్నింటితోనూ ఎప్పటికప్పుడు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుండాలి. అప్పుడే పరిస్థితుల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది.కానీ, ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ఇంకా అప్రమత్తం కాలేదు. సాగుతో సంబంధం ఉన్న వ్యవసాయం, ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్ శాఖలతో ఇంతవరకు ఒక్క సమావేశాన్నీ కలెక్టర నిర్వహించలేదు. ఎప్పుడేం చేయాలో ఎవరేం చేయాలో సూచించిన దాఖలాలు లేవు. దీంతో ఖరీఫ్ సాగు అగమ్య గోచరంగా తయారైంది.
ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలెంత ఉన్నాయో వ్యవసాయ అధికారుల
కు ఇంతవరకు తెలియదు. ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసేదెప్పుడో వ్యవసాయ శాఖకు కనీస సమాచారం లేదు. చెరువుల్లో ఉన్న నీటి సామర్థ్యం పైనా వ్యవసాయ శాఖకు అవగాహన లేదు. వాస్తవంగానైతే ఇరిగేషన్ అధికారులు ఆ సమాచారం ఇవ్వవల్సి ఉంది. వారిచ్చే సమాచారం మేరకు రైతుల్ని సిద్ధం చేయాలి. ఇక, వ్యవసాయ బోర్లకు విద్యుత్ సరఫరాపై ట్రాన్స్‌కో అధికారులు స్పష్టత ఇవ్వవల్సి ఉంది. ఎప్పుడిస్తారో, ఎప్పుడు నిలిపేస్తారో సమాచారం ఉంటే ఆ విధంగా రైతుల్ని వ్యవసాయ అధికారులు అప్రమత్తం చేసే అవకాశం ఉంది. వర్షాల్లేకపోతే అటు చెరువులు, ప్రాజెక్టులు, ఇటు వ్యవసాయ బోర్లుపైనే రైతులు ఆధారపడాల్సి ఉంటుంది. కానీ ఆ దిశగా అప్రమత్తం చేసే పరిస్థితులు కనిపించడం లేదు. దీనికంతటికీ శాఖల మధ్య సమన్వయం లేకపోవడమే కారణమని తెలుస్తోంది. కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించకపోవడంతో అధికారులకు అవగాహన కొరవడంది. ఈ నేపథ్యంలో చివరికి రైతులు నష్టపోవాల్సి వస్తోంది.