
తిరుమలలో బాబి సింహా వివాహం
తమిళ హీరో బాబి సింహా, నటి రేష్మీ మీనన్ వివాహం శుక్రవారం రాత్రి తిరుమలలో జరిగింది.
తమిళ హీరో బాబి సింహా, నటి రేష్మీ మీనన్ వివాహం శుక్రవారం రాత్రి తిరుమలలో జరిగింది. తమిళ సిని మా ‘జిగర్తండ’లో నటించిన బాబీ సింహా 2014లో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పొందారు. తమిళ సినీ రంగంలో ప్రముఖ హీరోయిన్‌గా పేరొందిన కేరళకు చెందిన రేష్మి మీనన్‌తో కలసి ‘ ఉరిమీన్ ’తోపాటు పలు తమిళ చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. రెండు కుటుంబాల అంగీకారంతో ఇటీవల నిశ్చితార్థం జరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇక్కడి గోవింద నిలయంలో బంధువుల సమక్షంలో తమిళ హీరో బాబి సింహా, నటి రేష్మీమీనన్ ఒక్కటయ్యారు. - సాక్షి, తిరుమల