సీమాంధ్ర సీఎం కుర్చీ కోసమే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లొల్లి చేస్తున్నారని పెద్దపల్లి ఎంపీ జి.వివేకానంద ఆరోపించారు.
సుల్తానాబాద్, న్యూస్‌లైన్: సీమాంధ్ర సీఎం కుర్చీ కోసమే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లొల్లి చేస్తున్నారని పెద్దపల్లి ఎంపీ జి.వివేకానంద ఆరోపించారు. ఆదివారం ఆయన సుల్తానాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో తీర్మానాన్ని వ్యతిరేకిస్తామని సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు చెబుతున్నారని, కానీ అసెంబ్లీలో తీర్మానం ఉండదని, అభిప్రాయాలు మాత్రమే తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్‌లో బిల్లు పెట్టి రాష్ట్రాన్ని విభజిస్తుందన్నారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేందుకే సీమాంధ్రులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, అందరూ సంయమనం పాటించాలని కోరారు. కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాల మేరకే తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు.