తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద శనివారం కారు డివైడర్ను ఢీకొట్టింది.
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద శనివారం కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రురాలని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అలాగే మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులు విజయనగరానికి చెందిన కొత్తపల్లి వెంకటేశ్వరరావు (45), ఆయన భార్య కొత్తపల్లి నాగేంద్రమ్మ (40), సాయి (22) గా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. మాలతీ అనే మహిళ తీవ్రంగా గాయపడి... ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.