చిత్తూరు జిల్లా వి.కోట మండల కేంద్రంలో ఆదివారం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటును పోలీసులు అడ్డుకున్నారు.
చిత్తూరు జిల్లా వి.కోట మండల కేంద్రంలో ఆదివారం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో దళిత సంఘాలు, పోలీసుల మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. దళిత సంఘాలకు చెందిన కొందరు స్థానిక బస్టాండ్ ఎదురుగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. అనుమతి తీసుకున్న తర్వాతే ఈ పని చేయాలంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఉద్రిక్తత నేపథ్యంలో డీఎస్పీ శంకర్ వి.కోట చేరుకుని దళిత సంఘాల వారితో చర్చలు ప్రారంభించారు.