స్థానిక రైల్వే స్టేషన్‌లో రైలుకిందపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రైలు కిందపడి వ్యక్తి మృతి
Mar 19 2017 9:27 AM | Updated on Sep 5 2017 6:31 AM
గిద్దలూరు(ప్రకాశం): స్థానిక రైల్వే స్టేషన్‌లో రైలుకిందపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి జేపీ చెరువుకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు పరదేశి చంద్రశేఖర్‌గా గుర్తించారు.
ఇతను స్ర్తీలోలుడని ఇప్పటికే పదుల సంఖ్యలో మహిళలతో సంబంధాలు నడిపాడని, 20 ఏళ్ల కిందటే భార్య బిడ్డలను వదిలేసి పలువురితో సహజీవనం చేసేవాడని స్థానికులు తెలిపారు. గత కొంత కాలంగా తాగుడుకు బానిసైన చంద్రశేఖర్ మద్యం మత్తులో రైలు కింద పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.
Advertisement
Advertisement