వివాహిత అనుమానాస్పద మృతి | The mysterious death of woman | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Oct 20 2015 12:02 PM | Updated on Aug 29 2018 8:24 PM

విజయనగరం పట్టణంలోని దాసన్నపేట కొత్తవాడలో మంగళవారం ఉదయం ఒక వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది

విజయనగరం పట్టణంలోని దాసన్నపేట కొత్తవాడలో మంగళవారం ఉదయం ఒక వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివసిస్తున్న స్వాతికి ఏడాది క్రితం వివాహమైంది. కాగా.. ఈ ఉదయం ఇంట్లో ఉరేసుకుని విగతజీవిగా కనిపించింది. భర్తే స్వాతిని చంపి ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని స్వాతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement