వైఎస్సార్ జిల్లా కమలాపురంలోని ఓ పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
వైఎస్సార్ జిల్లా కమలాపురంలోని ఓ పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వల్లూరు మండలం పైడికాలువ గ్రామానికి చెందిన డి.దినేష్, సుబ్బమ్మ దంపతుల ఏకైక సంతానం ఆంథోనీ కమలాపురంలోని ఆర్‌సీఎం స్కూల్‌లో 9వ తరగతి చదువుతూ.. అక్కడే హాస్టల్ లో ఉంటున్నాడు. బుధవారం ఉదయాన్నే చర్చికి వెళ్లేందుకు తలస్నానం చేసిన ఆంథోనీ కొద్దిసేపటికే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఆంథోనీని నిద్రలోనే పాము కాటు వేసి ఉండవచ్చని.. ఆ విష ప్రభావంతోనే అతడు చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు.