మృత్యుంజయురాలు | The girl from the bore well known | Sakshi
Sakshi News home page

మృత్యుంజయురాలు

Feb 3 2015 1:24 AM | Updated on Sep 2 2017 8:41 PM

మృత్యుంజయురాలు

మృత్యుంజయురాలు

బోరు బావిలో పడిపోరుున మడేళ్ల చిన్నారి అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడింది.

బోరు బావి నుంచి బయటపడ్డ బాలిక

పుత్తూరు:  బోరు బావిలో పడిపోయిన   ముడేళ్ల చిన్నారి అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడింది. ఈ సంఘటన  పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని చిన్నరాజకుప్పం ఆది ఆంధ్రవాడలో సోమవారం జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు చిన్నరాజకుప్పానికి చెందిన ఎల్లప్పరెడ్డి రెండు రోజుల క్రితం పొలంలో బోరు బావి తవ్వాడు. దానిపై గోనెసంచి (మూతగా) చుట్టి ఉంచాడు. ముగ్గుపిండి కోసం చిన్నరాజకుప్పం ఆది ఆంధ్రవాడకు చెందిన సునీత కూతురు బన్నీ(3)ని వెంట పెట్టుకుని ఆ బావి వద్దకు వెళ్లింది. ఆమె ముగ్గుపిండి సేకరణకు పూనుకుంది. పక్కనే ఆడుకుంటున్న బన్నీ ఆ బోరుబావికున్న గోనె సంచిని తీసింది. కాలుజారి అందులో  పడిపోయింది. వెంటనే గమనించిన తల్లి కేకలు వేసింది. సమీపంలోని గ్రామస్తులు అక్కడి కి చేరుకున్నారు.

ఓ తాడును బోరు బావిలోకి వదిలారు. సుమారు 20 అడుగుల లోతులో ఇరుక్కున్న బన్నీ ఆ తాడును పట్టుకోగా గ్రామస్తులు సురక్షితంగా బయటకుతీశారు. ఆ బాలిక శరీరంపై స్వల్ప గాయూలయ్యూరుు. చికిత్స నిమిత్తం పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి  తరలించారు. బాలిక సురక్షితంగా బయటపడడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement