రాజధానిపై స్పష్టత ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం | Sakshi
Sakshi News home page

రాజధానిపై స్పష్టత ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం

Published Tue, Oct 7 2014 8:12 AM

యలమంచిలి శివాజీ

కొత్తపేట(గుంటూరు) : నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని విషయంపై ప్రజలకు స్పష్టత ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమవుతోందని రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ విమర్శించారు. రాజేంద్రనగర్‌లోని తన నివాసంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. నూతన ప్రభుత్వం గద్దెనెక్కి నాలుగు నెలలు కావస్తు న్నా రాజధాని ఎంపికపై చిత్తశుద్ధి లేనట్లు కనిపిస్తోందన్నారు. ఇప్పుటికి నాలుగు కమిటీలు ఏర్పాటు చేసి పరస్పర విరుద్ధ నివేదికలతో ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు.

 వేలాది ఎకరాలు కబ్జా.. గుంటూరు, అమరావతి, విజయవాడ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూము లు వేలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయని, వాటిపై దృష్టిసారించనీయకుండా సీఎం చంద్రబాబుకు కొంతమంది తప్పుడు సలహాలిస్తున్నారని చెప్పారు. గుం టూరు, అమరావతి, విజయవాడ మధ్యలో ఎండోమెం ట్, రెవెన్యూ, మున్సిపల్, ఉడా, వక్ఫ్ భూములు సుమా రు 29 వేల ఎకారాలున్నాయన్నారు. వాటిని అభివృద్ధి చేయలేక, సాగు భూములను పూలింగ్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించడం సబబు కాదన్నారు. ఆ భూ ములను అలానే వదిలేస్తే కార్పొరేటర్లు, కబ్జాదారులు వాటిని కాలగ ర్భంలో కలి పేసి ప్రభుత్వ భూమి అనేదే లేకుండా చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. కృష్ణా సిమెంట్ ఫ్యాక్టరీ భూములు ఏమయ్యాయని ప్రశ్నించారు. 1980లో వేలాది ఎకరాలను కొందరు కబ్జా చేసి రిజిస్టర్ చేయించుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

 ఉన్న భూములను వినియోగించుకుంటే సరి
 రాజధాని నిర్మాణ ం 15 సంవత్సరాలైనా పూర్తి కాదని, ల్యాండ్ పూలింగ్ విషయాన్ని పక్కనబెట్టి ఉన్న ప్రభుత్వ భూములను వినియోగించుకోవాలని సూచించారు. ఉడా ఆధ్వర్యంలో 1984లో అమరావతి టౌన్ షిప్ ఏర్పాటు చేసిన  ప్రభుత్వం దాని ద్వారా ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూర్చలేకపోయిందని ఉదహరించారు. పులిచింతల పునరావస కేంద్రాల పరిస్థితి ఏమైందో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.
 ప్రభుత్వ కార్యాలయాలను

 వినియోగించుకోవాలి
 జిల్లాలోని ప్రభుత్వం కార్యాలయాలను ముఖ్యమంత్రి వినియోగించుకుంటూ రాష్ట్ర కార్యకలాపాలను సమీక్షించాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయం, ఏస్పీ కార్యాలయం, కోర్టు ప్రాంగ ణాలు కలిపి మొత్తం 22 ఎకారాలు, కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రంలో 84 ఎకారాల ఖాళీ భూములున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లో వేల అడుగుల మేరకు విశాలమైన ఫంక్షన్ హాళ్ల నిర్మాణాలు చేపట్టి విలువైన భూములను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఇప్పుటికైనా ప్రభుత్వం రాజధాని ఏర్పాటుపై పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేసి, ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు.


 

Advertisement
Advertisement