పత్రిక రిపోర్టర్ దారుణ హత్య | The brutal murder of reporter | Sakshi
Sakshi News home page

పత్రిక రిపోర్టర్ దారుణ హత్య

Oct 12 2015 8:00 PM | Updated on Sep 3 2017 10:51 AM

తన పొలానికి వెళ్లి తిరిగి వస్తున్న ఓ పత్రికా రిపోర్టర్ దారుణ హత్యకు గురయ్యాడు.

పొలానికి వెళ్లి తిరిగి వస్తున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా టి.నర్సాపురం మండలం తిరుమల దేవి పేట గ్రామంలో సోమవారం జరిగింది.

వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన కుప్పాల వెంకట నాగేశ్వర్ రావు (40) ఓ పత్రికలో కంట్రిబ్యూటర్ గా పనిచేస్తున్నాడు. సోమవారం భార్యతో కలిసి తిరుమలదేవి పేటలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. బైక్ పై తిరిగి వస్తుండగా.. ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు వీరిపై కత్తులతో దాడి చేశారు. దుండగులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన వరలక్ష్మిని పక్కకు తోసేశారు.

దీంతో ఆమె ఫోన్ ద్వారా అంబులెన్స్ కు సామాచారం అందించింది. అయితే అంబులెన్స్ వచ్చే సరికే నాగేశ్వరరావు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భూ వివాదాలే.. హత్యకు దారి తీసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement