దర్శి గురుకుల పాఠశాలలో అనుమానాస్పద స్థితోలో మృతి చెందిన విద్యార్థి మృతదేహాన్ని బందువులు గురువారం స్వగ్రామం నుంచి కలెక్టరేట్కు తీసుకెళ్లెందుకు ప్రయత్నించారు.
ప్రకాశం: దర్శి గురుకుల పాఠశాలలో అనుమానాస్పద స్థితోలో మృతి చెందిన విద్యార్థి మృతదేహాన్ని బందువులు గురువారం స్వగ్రామం నుంచి కలెక్టరేట్కు తీసుకెళ్లెందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వివరాలు..ప్రకాశం జిల్లా దర్శి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి మంగళవారం రాత్రి ఉరివేసుకుని కనిపించాడు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం దొడ్డవరం గ్రామానికి చెందిన పునూరు వియ్‌కుమార్ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం తరగతి గదిలో పుస్తకాలు ఉంచేసి ఎటో వెళ్లిపోయాడు. రాత్రి కూడా హాస్టల్ కు రాలేదు. బుధవారం ఉదయం పాఠశాల పక్కనున్న షెడ్డులో ఉరివేసుకుని విగతజీవుడై కనిపించాడు. ఉరికి వేలాడుతున్న వినయ్‌కుమార్‌ను చూసి తోటి విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయునికి తెలియజేశారు.