ఉపాధ్యాయ బదిలీల్లో సందిగ్దతకు తెర తొలగింది. ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లకు ప్రభుత్వ అంగీకారం తెలిపింది.
టీచర్ల బదిలీలకు తొలగిన అడ్డంకి
Jun 29 2017 4:41 PM | Updated on Aug 18 2018 8:05 PM
అమరావతి: ఉపాధ్యాయ బదిలీల్లో సందిగ్దతకు తెర తొలగింది. ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లకు ప్రభుత్వ అంగీకారం తెలిపింది. ఈ మేరకు వెబ్ కౌన్సెలింగ్ విధానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆన్‌లైన్ లో సీనియారిటీ లిస్ట్ ప్రకారం కౌన్సెలింగ్ విధానంలో ఖాళీగా ఉన్న చోట పోస్టింగ్ పొందే అవకాశం ఉందని తెలిపింది. బదిలీల పై తదుపరి షెడ్యూల్ సాయంత్రానికి విడుదల చేయనున్నట్లు వివరించింది. బదిలీలకు సర్వీస్ పాయింట్స్ 70, పెర్ఫార్మెన్స్ పాయింట్స్ 30 గా నిర్ణయించనుంది.
Advertisement
Advertisement