సైనికుడి భూమికి రక్షణ కరువు

tdp leaders focus on Soldier land - Sakshi

మాజీ సైనికుడి భూమిని తవ్వి  మట్టి అమ్ముకున్న టీడీపీ నేతలు 

నీరు–చెట్టు పథకం పేరుతో ఆక్రమణ

 అధికార పార్టీకి అండగా నిలిచిన రెవెన్యూ అధికారులు

 నోటి దగ్గర కూడు లాక్కున్నారుఅంటూ గోడు వెళ్లబోసుకున్న సైనికుడి కుటుంబసభ్యులు

సాక్షి, అమరావతి బ్యూరో: దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి శత్రువులను జయించిన సైనికుడి కుటుంబం అధికార పార్టీ ఆక్రమణల దెబ్బకు తల్లడిల్లుతోంది. మాజీ సైనికుని సేవలు గుర్తించి భారత ప్రభుత్వం మంజూరు చేసిన భూమిపై టీడీపీ నేతల కన్ను పడడంతో రాత్రికి రాత్రే పొక్లెయిన్ల ద్వారా తవ్వేశారు. అడ్డుకోవాల్సిన అధికారులు అండగా నిలవడంతో ఆ కుటుంబం న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఏటా 100 బస్తాల ధాన్యం పండించుకుని దర్జాగా బతికిన ఆ కుటుంబ సభ్యులు ఇప్పుడు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్ర గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు గ్రామానికి చేరుకోవడంతో బాధిత సైనికుని కుటుంబ సభ్యులు జననేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని మొరపెట్టుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... 

గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందిన షేక్‌ ఆదం (మిలటరీ ఆదం) 1942 ఆగస్టు 13వ తేదీన భారత సైన్యంలో చేరాడు. 1946లో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఆదంకు కాలిలో బుల్లెట్‌ దిగడంతో ప్రత్యేక విమానంలో ఆస్పత్రికి తరలించారు. కాలికి గాయం అయిన ఆయన ఉద్యోగ విరమణ చేసి తిరిగి 1959లో డిఫెన్స్‌ సెక్యూరిటీ ఫోర్సులో చేరాడు. 1970 వరకు భారత ఆర్మీలో సేవలు అందించిన ఆదం ఉద్యోగ విరమణ పొందారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆయన సేవలను మెచ్చిన భారత ప్రభుత్వం 1965లో రక్ష మెడల్‌ ఇచ్చి గౌరవించింది. 1966లో అప్పటి కలెక్టర్‌ ఆయన జీవనోపాధికి సర్వే నంబరు–364లో 2.59 ఎకరాల భూమిని ఇచ్చారు. ఐదుగురు సంతానం ఉన్న ఆదాం అప్పటి నుంచి ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగించారు. 

మాజీ సైనికుని భూమిపై పెద్దల కన్ను
మేడికొండూరు గ్రామ శివారులో 1974 నుంచి 2014 సంవత్సరం వరకూ క్రమం తప్పకుండా ప్రభుత్వానికి శిస్తు కడుతూ ఆదాం కుటుంబం పొలం సాగు చేసుకుంటోంది. 2016లో ఆ భూమిపై టీడీపీ నాయకుల కన్ను పడింది. నీరు చెట్టు పథకం పేరుతో పొలాన్ని తవ్వేందుకు అధికారులతో పావులు కదిపారు. రాత్రికి రాత్రే పొలంలో పొక్లెయిన్లు, లారీలతో రెండు రోజుల్లోనే మట్టిని తవ్వి అమ్ముకున్నారు. తాము జీవనాధారం కోల్పోతున్నామని, రక్షణ కల్పించాలని వారు పలుమార్లు ప్రభుత్వ అ«ధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం కరువైంది. గత్యంతరం లేక ఆ మాజీ సైనికుని కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 

న్యాయస్థానం తీర్పును సైతం లెక్క చేయని అధికారులు
మట్టి తవ్వకాలను తాత్కాలికంగా నిలిపి వేయాలని విచారణ అనంతరం నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు నుంచి ఆదేశాలు జారీ అయినా టీడీపీ నాయకులు కానీ, అధికారులు కానీ లెక్క చేయకుండా మట్టి తవ్వుకుని సొమ్ము చేసుకున్నారు. దీంతో ఆదాం కుటుంబసభ్యులు శనివారం ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌ను కలిసి తమ గోడు మొరపెట్టుకున్నారు.

మరిన్ని వార్తలు

21-11-2018
Nov 21, 2018, 08:12 IST
సాక్షిప్రతినిధి విజయనగరం: ‘‘కురుపాం గడ్డ.. వైఎస్సార్‌ కుటుంబం అడ్డా’’అని మరోసారి రుజువైంది. కురుపాంలో జరిగిన జననేత భారీ బహిరంగ సభ ...
21-11-2018
Nov 21, 2018, 08:07 IST
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేçపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం నాటి పాదయాత్ర వివరాలను ఆ పార్టీ...
21-11-2018
Nov 21, 2018, 08:02 IST
ప్రజా సంకల్పయాత్రలో జననేత జగన్‌కు ప్రజలు దారి పొడవునా తమ సమస్యలను చెబుతూనే ఉన్నారు. నాలుగున్నరేళ్ల తెలుగుదేశం పాలనలో అన్ని...
21-11-2018
Nov 21, 2018, 08:01 IST
విజయనగరం :అన్నా మాది బిత్తరపాడు గ్రామం. మా గ్రామం తోటపల్లి బ్యారేజీలో పోయింది. మాకు వేరే చోట స్థలాలు ఇచ్చారు....
21-11-2018
Nov 21, 2018, 07:59 IST
విజయనగరం: పార్వతీపురం గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉద్యోగులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నా... గిరిజన సంక్షేమ శాఖలో ప్రత్యేక...
21-11-2018
Nov 21, 2018, 07:58 IST
విజయనగరం :మీరు సీఎంగా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అంతా మోసం, దగా. మాయమాటలు చెబుతూ మమ్మల్ని...
21-11-2018
Nov 21, 2018, 07:47 IST
విజయనగరం :అన్నా మా గ్రామాలను మీరే ఆదుకోవాలి. కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో  ఇబ్బందులు పడుతున్నాం. కిచ్చాడ, వన్నం, పులిగుమ్మి,...
21-11-2018
Nov 21, 2018, 07:44 IST
ఏటా పంట పొలాలు మునిగిపోతున్నాయి... దళాయిపేట గ్రామానికి ఓ వైపు నాగావళి, మరోవైపు గుమ్మడిగెడ్డ ఉన్నాయి. నీరు ఎక్కువగా వస్తే...
21-11-2018
Nov 21, 2018, 07:39 IST
విజయనగరం :అన్నా మా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. కొమరాడ మండలంలో గుణిత తిలేసుపంచాయతీలో సవర గుణద,...
21-11-2018
Nov 21, 2018, 07:36 IST
విజయనగరం :ఎన్నో ఏళ్ల నుంచి పీఎంపీ డాక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నాం. గ్రామాల్లో రోగులకు ప్రథమ చికిత్స అందిస్తూ సేవలను అందిస్తున్నాం....
21-11-2018
Nov 21, 2018, 07:19 IST
విజయనగరం :2004 సెప్టెంబర్‌ తర్వాత అన్ని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ సీపీఎస్‌ విధానం ప్రభుత్వం అమలు చేస్తుంది....
21-11-2018
Nov 21, 2018, 07:15 IST
ప్రజాసంకల్పయాత్ర బృందం :రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, మాఫియాలు, మోసాలతో సాగుతున్న పాలనకు చరమగీతం పాడి జననేత జగన్‌మోహన్‌ రెడ్డి అందించే...
21-11-2018
Nov 21, 2018, 07:10 IST
విజయనగరం,ప్రజా సంకల్పయాత్ర బృందం: రాష్ట్రంలో జరిగే ప్రతీ అసాంఘిక కార్యక్రమానికీ, అవినీతికీ, దోపిడీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ప్రధాన సూత్రధారి అని...
21-11-2018
Nov 21, 2018, 07:00 IST
ప్రజా సంకల్పయాత్ర బృందం: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గంలో రాజకీయ, సీని ప్రముఖులకు ప్రాధాన్యం తగ్గించి ఉత్తమ సామాజిక వాదులకు,...
21-11-2018
Nov 21, 2018, 04:33 IST
చంద్రబాబు దొంగతనాలు, దోపిడీలు, అరాచకాల మీద విచారణ చేయాల్సిందిగా రేపు హైకోర్టు ఆదేశిస్తే, మన రాష్ట్రానికి హైకోర్టే అక్కరలేదని ఆయన...
21-11-2018
Nov 21, 2018, 03:58 IST
ఇప్పటి వరకు నడిచిన దూరం: 3,280.4 కి.మీ  20–11–2018, మంగళవారం,  కురుపాం, విజయనగరం జిల్లా. గిరిజన వర్గాలకు మూడు నెలల మంత్రి పదవి ఎన్నికల తాయిలం...
20-11-2018
Nov 20, 2018, 19:54 IST
సాక్షి, విజయనగరం : రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు...
20-11-2018
Nov 20, 2018, 18:00 IST
చంద్రబాబుపై విచారణ చేయమని హైకోర్టు ఆర్డర్‌ ఇస్తే.. ఏపీకి హైకోర్టు కూడా అవసరం లేదని జీవో ఇచ్చినా ఇస్తేస్తారని ఎద్దేవా ...
20-11-2018
Nov 20, 2018, 16:53 IST
జీవితాంతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటానని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు.
20-11-2018
Nov 20, 2018, 12:24 IST
సాక్షి, కురుపాం(విజయనగరం): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో విజయవంతంగా...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top