మద్యం మత్తులో టీడీపీ నేత వీరంగం సృష్టించాడు.
భీమవరం: మద్యం మత్తులో టీడీపీ నేత వీరంగం సృష్టించాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని 38వ వార్డు టీడీపీ కౌన్సిలర్ భర్త పిల్ల ముసలయ్య మద్యం మత్తులో కారు నడుపుతూ ఇళ్లపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
లంకపేటకు చెందిన టి. మావుళ్లు అక్కడికక్కడే మృతిచెందగా.. శాంతమ్మ, మరియమ్మ అనే మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయలయ్యాయి. దీంతో వారిని ఏలూరు, విజయవాడ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కాగా కౌన్సిలర్ కుటుంబంతో సహా పరారైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.