వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో శుక్రవారం తెలుగు తమ్ముళ్లు బాహాబాహికి దిగారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ సతీశ్ రెడ్డి ..
కడప : వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో శుక్రవారం తెలుగు తమ్ముళ్లు బాహాబాహికి దిగారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ సతీశ్ రెడ్డి నిర్వహిస్తున్న సమీక్ష సమావేశానికి రావొద్దంటూ సింహాద్రిపురం జెడ్పీటీసీ పోరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై టీడీపీలోని మరో వర్గం దాడి చేసింది. సతీశ్ రెడ్డిని కలిసేందుకు ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్కు వచ్చిన ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగింది. ఈ ఘటనతో స్థానికంగా అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.