ఏపీలో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేయండి: సుప్రీంకోర్టు

Supreme Court Order Lifting Of Election Code In Andhra Pradesh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో స్ధానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల కోడ్‌ను తక్షణం ఎత్తివేయాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ సూర్యకాంత్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. 
(చదవండి: ఎన్నికలంటే విపక్షాలకు భయమెందుకు)

ఎన్నికల వాయిదా నేపథ్యంలో రాష్ట్రంలో కోడ్‌ కొనసాగింపును ప్రభుత్వం ప్రశ్నించింది. కోడ్‌ అమల్లో ఉందని చెప్తూ సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని కోర్టు దృష్టికి తెచ్చింది. దీంతో ఎన్నికల కమిషనర్‌ తీరును తప్పుబట్టిన సుప్రీం కోర్టు.. ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకపోవడాన్ని ఆక్షేపించింది. ఎన్నికల నిర్వహణపై ఈసీ కచ్చితంగా రాష్ట్రప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందేనని వెల్లడించింది. ఎన్నికల కోడ్‌ ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని చెప్పింది. సుప్రీం ఆదేశాలతో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు అడ్డంకులు తొలగినట్టయింది.
(చదవండి: ‘పచ్చ’ పార్టీ నుంచి.. పరుగో.. పరుగు..)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top