బస్సు ఆపలేదని విద్యార్థుల ఆందోళన | students dharna at vijayanagaram | Sakshi
Sakshi News home page

బస్సు ఆపలేదని విద్యార్థుల ఆందోళన

Aug 25 2015 8:51 AM | Updated on Sep 3 2017 8:07 AM

ఆర్టీసీ బస్సు ఆపడంలేదని విద్యార్థులు రోడ్డుపైన ఆందోళనకు దిగారు.

విజయనగరం: ఆర్టీసీ బస్సు ఆపడంలేదని విద్యార్థులు రోడ్డుపైన ఆందోళనకు దిగారు. విజయనగరం సమీపంలోని కోదాడపేట వైపు నుంచి ఆర్టీసీ బస్సు మంగళవారం ఉదయం నగరంలోకి వస్తోంది. కోదాడ పేటలో 30 మంది విద్యార్థులు బస్సు కోసం వేచి ఉండగా ఖాళీ లేకపోవడంతో డ్రైవర్ బస్సును ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. దాంతో విద్యార్థులు ఒక్కసారిగా బస్సుకు అడ్డంగా వచ్చారు. దీంతో డ్రైవర్, కండక్టర్‌లతో వాగ్వివాదానికి దిగారు. రోడ్డు పై బైఠాయించి తమను ఎక్కించుకోవాలని ఆందోళన చేపట్టారు. బస్సులు సక్రమంగా ఆపడంలేదని, కాలేజీ, స్కూళ్లకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement