కర్నూలు జిల్లా కోస్గి మండల కేంద్రంలో వడదెబ్బకు ఆదివారం ఓ డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు.
కర్నూలు జిల్లా కోస్గి మండల కేంద్రంలో వడదెబ్బకు ఆదివారం ఓ డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. స్థానికంగా డిగ్రీ కళాశాలలో చదివే సురేష్ (19) ఆదివారం సెలవు కావడంతో పని మీద బయట తిరిగి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. కొద్దిసేపటికే స్పృహ తప్పి పడిపోయాడు. ఆస్పత్రికి తరలించగా... వడదెబ్బకు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.