
వేసవి రద్దీ దృష్ట్యా వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: వేసవి రద్దీ దృష్ట్యా వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మచిలీపట్నం–సికింద్రాబాద్ (07049/07050) స్పెషల్ ట్రైన్ జూన్ 2, 9, 16, 23, 30 తేదీల్లో మధ్యాహ్నం 3.05 గంటలకు మచిలీపట్నం నుంచి బయల్దేరి అదేరోజు రాత్రి 10.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి అదే రోజు రాత్రి 10.55 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.55 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.
మచిలీపట్నం–హైదరాబాద్ (07258)స్పెషల్ ట్రైన్ జూన్ 2, 9, 16, 23, 30 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు మచిలీపట్నం నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4.45కు హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్–విజయవాడ (07258) స్పెషల్ ట్రైన్ జూన్ 3, 10, 17, 24, జూలై 1 తేదీల్లో రాత్రి 10.20 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.35కు విజయవాడ చేరుకుంటుంది.