పత్రికల పాత్ర గణనీయం | Significantly the role of the press | Sakshi
Sakshi News home page

పత్రికల పాత్ర గణనీయం

Jul 17 2014 2:01 AM | Updated on Sep 2 2017 10:23 AM

సమాజాభివృద్ధిలో పత్రికలపాత్ర ఎంతో గణనీయమైనదని వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు సామినేని విశ్వనాథం అన్నారు.

  • వైఎస్సార్‌సీపీ సీనియర్  నాయకులు సామినేని విశ్వనాథం
  • జగ్గయ్యపేట అర్బన్ : సమాజాభివృద్ధిలో పత్రికలపాత్ర ఎంతో గణనీయమైనదని వైఎస్సార్‌సీపీ సీనియర్  నాయకులు సామినేని విశ్వనాథం అన్నారు. బుధవారం  వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను స్వగృహంలో  పట్టణంలో నూతనంగా ప్రారంభించిన ఎదురుదాడి వారపత్రిక ప్రచురించిన మున్సిపల్ ప్రత్యేక అనుబంధాన్ని ఆయన ఆవిష్కరించారు.  

    ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలకు,ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉండే పత్రికలు నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురిస్తూ అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా ప్రజాప్రతినిదులు, అధికారులు పనిచేసేలా మరింత చొరవకు పత్రికలు కృషిచేయాలన్నారు. ఎదురుదాడి వారపత్రిక  సంపాదకులు మాశెట్టి రమేష్‌బాబును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మున్సిపల్ చైర్మన్‌తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ పారదర్శకమైన పాలనను అందించేందుకు పత్రికలు తమవంతు సహాయసహాకారాలు అందించాలని కోరారు.  

    వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్  మదార్‌సాహెబ్, మున్సిపల్  మాజీ చైర్మన్ ముత్యాల చలం,  వైస్ చైర్మన్ మహ్మద్ అక్బర్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు చింకా వీరాంజనేయులు, జె.ఉదయభాస్కర్, శివాలయం దేవస్థాన మాజీ చైర్మన్ ఎం.కేశవరావు, నాయకులు శేషం ప్రసాద్, వేముల రామకృష్ణ, రఫీ, పలు వార్డుల  కౌన్సిలర్లు  పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement