యూపీఏ సర్కారు మీద సీమాంధ్ర ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై తెలంగాణ ప్రాంత ఎంపీలు మండిపడ్డారు.
యూపీఏ సర్కారు మీద సీమాంధ్ర ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై తెలంగాణ ప్రాంత ఎంపీలు మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానం అనైతికమని, మందా జగన్నాథం అన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నారని, అప్పట్లో సీమాంధ్ర ఎంపీలు కూడా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారని, ఇక రేపో, ఎల్లుండో రాష్ట్రపతి నుంచి అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే రాజీనామా చేయాలని, విభజన వల్లే రెండు రాష్ట్రాలకు లాభం జరుగుతుందని మరో ఎంపీ వివేక్ అన్నారు.
కాగా, సొంత పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అంటే తల్లి శవాన్ని కోరుకోవడమేనని, సోనియాగాంధీపై అవాకులు, చవాకులు పేలడం మానుకోవాలని ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, పొన్నం ప్రభాకర్ అన్నారు. సమన్యాయం ఏమిటో చంద్రబాబు చెప్పాలని వాళ్లు డిమాండ్ చేశారు.