బాబు కోరితే భద్రత పెంచుతాం: మంత్రి సుచరిత

Security of Chandrababu Not Downgraded: Mekathoti Sucharitha - Sakshi

సాక్షి, గుంటూరు: తనకు భద్రత తగ్గించారని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. చంద్రబాబు భద్రతలో ఎలాంటి మార్పులు చేయలేదని, ఒక్కరిని కూడా తగ్గించలేదని స్పష్టం చేశారు. ఆర్నెళ్లకొకసారి ఇలాంటి ఆరోపణలు చేయటం టీడీపీ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు. ప్రజల్లో సానుభూతి కోసం ఇలాంటి చవకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన వ్యక్తిగత మాజీ కార్యదర్శి ఇంట్లో జరిగిన ఆదాయపన్ను శాఖ జరిపిన సోదాల గురించి మాట్లాడరు గానీ ఇలాంటి ఆరోపణలు మాత్రం చేస్తుంటారని చురక అంటించారు. చంద్రబాబు కోరితే ఆయనకు మరింత భద్రతను పెంచటానికి సిద్ధమని హోంమంత్రి ప్రకటించారు. (చదవండి: ఐటీ గుప్పిట్లో బిగ్‌బాస్‌ గుట్టు!)

183 మందితో చంద్రబాబుకు భత్రత: డీజీపీ
దేశంలో అత్యంత ఎక్కువగా చంద్రబాబుకు భద్రత కల్పిస్తున్నామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. ప్రస్తుతం జడ్‌ప్లస్‌ కేటగిరి కింద సెక్యురిటీ ఇస్తున్నట్టు చెప్పారు. మొత్తం 183 మందితో ఆయనకు భద్రత ఏర్పాటు చేశామన్నారు. విజయవాడలో 135 మంది, హైదరాబాద్‌లో 48 మందితో భద్రత కల్పిస్తున్నట్టు తెలిపారు. (చదవండి: చంద్రబాబూ.. ఏంటయ్యా నీ బాధ?)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top