హైదరాబాద్, తిరుపతి రైల్వే స్టేషన్లలో ఆధునిక సదుపాయాలు | sarkar announced that modern facilities for hyderabad and tirupathi | Sakshi
Sakshi News home page

హైదరాబాద్, తిరుపతి రైల్వే స్టేషన్లలో ఆధునిక సదుపాయాలు

Dec 13 2013 12:32 AM | Updated on Sep 2 2017 1:32 AM

హైదరాబాద్, తిరుపతి సహా దేశవ్యాప్తంగా 24 ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి తేనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి అధిర్‌రంజన్ చౌధురి తెలిపారు.

సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్, తిరుపతి సహా దేశవ్యాప్తంగా 24 ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి తేనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి అధిర్‌రంజన్ చౌధురి తెలిపారు. ఈ మేరకు ఆయన లోక్‌సభలో లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

 

అదేవిధంగా రైల్వేస్టేషన్లున్న ప్రదేశాల చారిత్రక నేపథ్యం, పర్యాటక ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని పర్యాటక మంత్రిత్వశాఖ భాగస్వామ్యంతో ప్రయాణికులకు మరిన్ని సదుపాయాలు కల్పించనున్నట్టు తెలిపారు. ఆధునీకరణ, సదుపాయాల వ్యయాన్ని రైల్వే, పర్యాటక శాఖలు భరిస్తాయన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement