ఇసుక మాఫియాపై దాడులు | Sand mafia attacks are moving as inappropriate | Sakshi
Sakshi News home page

ఇసుక మాఫియాపై దాడులు

Nov 24 2013 3:17 AM | Updated on Oct 8 2018 4:18 PM

నాగావళి, వంశధార నదీ తీర ప్రాంతాల నుంచి అనుమ తులు లేకుండా ఇసుకను అక్రమం గా తరలిస్తున్న వారిపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపిం చారు.

శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : నాగావళి, వంశధార నదీ తీర ప్రాంతాల నుంచి అనుమ తులు లేకుండా ఇసుకను అక్రమం గా తరలిస్తున్న వారిపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపిం చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇసుక అక్రమ రవాణాదారులపై దాడుల జోరు పెరిగింది. శని వారం జిల్లాలో పలు ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు దాడులు చేసి ఇసుక రవాణాచేస్తున్న వాహనాలను సీజ్ చేసి పోలీ సులకు అప్పగించారు. కొన్ని రోజుల నుంచి రెవెన్యూ, విజిలెన్‌‌స అధికారుల దాడులతో ఇసుక అక్రమ రవాణాకు తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది.
 
 ఆరు ట్రాక్టర్ల పట్టివేత
 అనుమతులు లేకుండా నాగావళి నుంచి నుంచి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను రెవెన్యూ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు.   శ్రీకాకుళం తహశీల్దార్ ఎం.కాళీప్రసాద్, రెవెన్యూ పర్యవేక్షకులు శంకర్, అమర్‌నాథ్ దాడులు చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని బలగ ప్రాంతంలో హడ్కో కాలనీ వద్ద నాలుగు ట్రాక్టర్లు, రూరల్ మండలంలోని కళ్లేపల్లి వద్ద, కునుకుపేట వద్ద ఒక ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. వీటిని పోలీసులకు అప్పగించారు.   
 
 తమ్మినాయుడుపేట వద్ద 
 ఐదు ట్రాక్టర్లు...
 ఎచ్చెర్ల క్యాంపస్ : జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న తమ్మినాయుడు పేట నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను ఎచ్చెర్ల తహశీల్దార్ బి.వెంకటరావు సీజ్ చేశారు. వాటిని ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఐదు రోజుల కిందట విజిలెన్స్ అధికారులు ఐదు ట్రాక్టర్లు పట్టుకున్నారు. వాటిలో కొన్ని ట్రాక్టర్లకు నంబర్లు కూడా లేవు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పది రోజుల నుంచి రెవెన్యూ అధికారులు, విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నా అక్రమ రవాణా మాత్రం యథాతథంగా సాగుతోంది. 
 
 పోలాకిలో ట్రాక్టర్
 పోలాకి : వంశధార నది నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు డిప్యూటీ తహశీల్దార్ టి.సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం రాత్రి రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. వనిత మండలం వంశధార నది నుంచి ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను సీజ్ చేశామని, డ్వామా పీడీ కళ్యాణచక్రవర్తి , జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పోలాకి పోలీసులకు అప్పగించామన్నారు. ఇసుక తరలింపు గురించి పలుమార్లు ఇసుక ట్రాక్టర్ల యజమానులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో దాడులు చేశామన్నారు.  దాడులు చేసిన వారిలో ఎస్‌ఐ అప్పలరాజు, ఆర్‌ఐ సంతోష్‌కుమార్, పోలీసులు ఉన్నారు. 
 
 నేరడి బ్యారేజ్‌వద్ద...
 భామిని : భామిని మండలం నేరడి బ్యారేజ్, కాట్రగడ-బి గ్రామాల మధ్య శనివారం అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను తహశీల్దార్ ఎం.సావిత్రి పట్టుకొని సీజ్ చేశారు. అనంతరం బత్తిలి పోలీసులకు ట్రాక్టర్‌ను అప్పగించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఒడిశాకు చెందిన ట్రాక్టర్‌ను అడ్డుకున్నారు. నేరడి బ్యారేజ్ వద్ద వంశధార నదీ తీరం నుంచి ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. తహశీల్దార్ చొరవతో తాత్కాలికంగా ఇసుక అక్రమ రవాణా నిలిచింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement