నేడు ‘సమైక్య’ బంద్ | samaikyandhra bandh today | Sakshi
Sakshi News home page

నేడు ‘సమైక్య’ బంద్

Jan 3 2014 4:17 AM | Updated on May 25 2018 9:12 PM

విభజన విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగాను, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తోను శుక్రవారం ‘సమైక్య’

కాకినాడ, న్యూస్‌లైన్ :విభజన విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగాను, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తోను  శుక్రవారం ‘సమైక్య’ బంద్ నిర్వహించనున్నారు. ఈ బంద్‌ను జిల్లాలో విజయవంతం చేసేందుకు అన్ని వర్గాలూ సమాయత్తమవుతున్నా యి. బంద్‌ను విజయవంతం చేసేందు కు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్లు, ముఖ్య నేతలు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు సమైక్య పరిరక్షణ వేదిక కూడా బంద్‌కు సమాయత్తమైంది. కాకినాడ ఎన్జీవో హోమ్‌లో వేదిక జిల్లా అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్‌తోపాటు ఉద్యోగ, చాంబర్ ఆఫ్ కామర్స్, ఆటో యూనియన్ల ప్రతినిధులు సహా  వివిధ వర్గాల నేతలు హాజరయ్యారు. వారంతా బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉద్యోగులంతా విధులకు దూరంగా ఉండి బంద్‌లో పాల్గొనాలని నిర్ణయించారు. దీంతో శుక్రవారం అన్ని ప్రభుత్వ సేవలూ నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క వ్యాపార సంస్థలు కూడా బంద్ పాటించేందుకు ముందుకు వచ్చాయి. బంద్‌ను విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి పార్టీ శ్రేణులకు, ప్రజలకు, సమైక్యవాదులకు పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement