ఎనిమిది పర్యాటక ప్రదేశాల్లో రోప్‌వేలు | rope ways in 8 tourisem spots in AP says nageshwar rao | Sakshi
Sakshi News home page

ఎనిమిది పర్యాటక ప్రదేశాల్లో రోప్‌వేలు

Jul 1 2015 7:00 PM | Updated on Sep 3 2017 4:41 AM

రాష్ట్రంలో ఎనిమిది పర్యాటక ప్రదేశాల్లో రోప్‌వేలు ఏర్పాటు చేయనున్నామని పర్యాటక శాఖ జనరల్ మేనేజర్ టి.నాగేశ్వరరావు వెల్లడించారు.

చిత్తూరు: రాష్ట్రంలో ఎనిమిది పర్యాటక ప్రదేశాల్లో రోప్‌వేలు ఏర్పాటు చేయనున్నామని పర్యాటక శాఖ జనరల్ మేనేజర్ టి.నాగేశ్వరరావు వెల్లడించారు. బుధవారం చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌కు రోప్‌వే ఏర్పాట్లను ఓ ప్రైవేటు సంస్థకు చెందిన ప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... తొలిదశలో చిత్తూరు జిల్లాలోని హార్సిలీహిల్స్, కర్నూలు జిల్లాలోని అహోబిలం, అనంతపురం జిల్లాలోని పెనుగొండ, గుత్తి, కృష్ణా జిల్లాలోని కొండపల్ల్లి ఖిల్లా, తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరం, గుంటూరు, కోటప్పకొండలో రోప్‌వేలను ఏర్పాటు చేయడం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. హార్సిలీహిల్స్‌లో రోప్‌వే కోసం సర్వే చేసే బాధ్యతలను ఢిల్లీకి చెందిన కేపీఎంజీ సంస్థకు అప్పగించినట్లు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement