సాయిబాబా ఆలయంలో చోరీ | Robbery in Temple | Sakshi
Sakshi News home page

సాయిబాబా ఆలయంలో చోరీ

Jan 10 2016 9:47 AM | Updated on Aug 30 2018 5:27 PM

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి పంచాయతి పరిధిలోని ఈదలవారిపాలెం గ్రామంలో గల సాయిబాబా ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది.

ముత్తుకూరు (నెల్లూరు) : నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి పంచాయతి పరిధిలోని ఈదలవారిపాలెం గ్రామంలో గల సాయిబాబా ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఆలయంలోని రెండు హుండీలను ధ్వంసం చేసి అందులో ఉన్న సుమారు రూ. 50 వేల రూపాయలతో పాటు, కిలో వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement