పోలీసులపై 'ఎర్ర' కూలీల దాడి : ఇద్దరి అరెస్ట్‌ | red sandalwood workers attack with stones on police in chittoor | Sakshi
Sakshi News home page

పోలీసులపై 'ఎర్ర' కూలీల దాడి : ఇద్దరి అరెస్ట్‌

Jan 23 2017 8:48 AM | Updated on Sep 5 2017 1:55 AM

పోలీసులపై 'ఎర్ర' కూలీల దాడి : ఇద్దరి అరెస్ట్‌

పోలీసులపై 'ఎర్ర' కూలీల దాడి : ఇద్దరి అరెస్ట్‌

చిత్తూరులో ఎర్రచందనం కూలీలు మరోసారి రెచ్చిపోయారు.

చంద్రగిరి : చిత్తూరులో ఎర్రచందనం కూలీలు మరోసారి రెచ్చిపోయారు. శేషాచలం అడవుల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులపై దాడులకు తెగబడ్డారు. ఆదివారం రాత్రి పోలీసులకు అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న కూలీలు ఎదురుపడ్డారు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నస్తుండగా పోలీసులపై రాళ్ల దాడి చేశారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో లక్ష్మీపురం చెరువు సమీపంలో ఇద్దరు కూలీలను అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 50 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం శేషాచలం అడవుల్లో కూంబింగ్‌ కొనసాగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement