
నేడే రంజాన్
సోమవారం సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో ముస్లింలు మంగళవారం రంజాన్ పండుగ జరుపుకోనున్నారు.
తిరుపతి: సోమవారం సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో ముస్లింలు మంగళవారం రంజాన్ పండుగ జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఈదుల్ ఫితర్ ప్రారంభ సూచికగా సోమవారం సాయంత్రం తిరుపతి నగరంలోని అన్ని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ముతవల్లీలతో ముస్లిం పెద ్దలు సమావేశమై మంగళవారం ఈద్గా మైదానంలో జరగాల్సిన రంజాన్ పర్వదిన ఏర్పాట్లపై చర్చలు జరిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.