ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కలిశారు.
ఉద్యోగ పత్రాలు అందుకున్న సింధు
Jul 27 2017 4:30 PM | Updated on Aug 18 2018 4:13 PM
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కలిశారు. సీఎం చేతుల మీదుగా గ్రూప్-1 ఉద్యోగ పత్రాలను ఆమె గురువారం అందుకున్నారు. అనంతరం సింధు మాట్లాడుతూ.. సీఎం చేతుల మీదుగా ఉద్యోగ పత్రాలు తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. అందరూ ముందుగా క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ సీఎం సూచించారని తెలిపారు. ఏపీ ప్రభుత్వం క్రీడలను బాగా ప్రోత్సహిస్తుందని, యువత కూడా క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
Advertisement
Advertisement