
చంద్రబాబు, కెసిఆర్ ఒకరి తరువాత ఒకరు...
గవర్నర్ నరసింహన్తో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను వెల్లడించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరి తరువాత ఒకరు ఈ సాయంత్రం విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్తో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను వెల్లడించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరి తరువాత ఒకరు ఈ సాయంత్రం విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేశారు. గవర్నర్ సమక్షంలో వీరిద్దరూ ఈరోజు మధ్యాహ్నం 12.10 నుంచి 12.40 వరకూ ఏకాంతంగా సమావేశమయిన విషయం తెలిసిందే.
కెసిఆర్ ఈ సాయంత్రం 4 గంటలకు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు సాయంత్రం 6 గంటలకు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. గవర్నర్ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన, వీరిద్దరూ అంగీకరించిన అంశాలను ఇద్దరూ మీడియాకు తెలుపుతారు.