తెలంగాణ రాష్ట్ర విభజనతో పాటు రాష్ట్రపతి పాలనకు ప్రణబ్‌ముఖర్జీ శనివారం ఆమోదముద్ర వేయడంతో ఆయ న హవాకు తాత్కాలిక బ్రేకులు పడ్డాయి.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : భారీ నీటిపారుదల శాఖా మంత్రి పి సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి అయ్యా రు. తెలంగాణ రాష్ట్ర విభజనతో పాటు రాష్ట్రపతి పాలనకు ప్రణబ్‌ముఖర్జీ శనివారం ఆమోదముద్ర వేయడంతో ఆయ న హవాకు తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. కేంద్ర కేబినెట్ సిఫారసు మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేయ గా... జిల్లాలో పాలనపగ్గాలు చేతులు మారాయి. రాష్ట్ర మంత్రి మండలిలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి కానుం డగా... ఇకపై కలెక్టర్ జిల్లా పాలనా వ్యవహారాల్లో మరింత కీలకపాత్ర పోషించనున్నారు. అసెంబ్లీ సుప్తచేతనావస్థలోకి వెళ్లడంతో ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదే స్థితిలో ఉంటారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో శాసనసభను రద్దుచేసే అంశాన్ని పేర్కొనకపోవడంతో ఎమ్మెల్యే పదవులకు ఢోకా ఉండదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
హ్యాట్రిక్ ఎమ్మెల్యే..
బోధన్‌కు చెందిన సుదర్శన్ రెడ్డి మద్యం వ్యాపారంలో కొనసాగుతూ 1999లో రాజకీయాల్లోకి వచ్చారు. అదే సంవత్సరంలో మొదటిసారిగా బోధన్ నుంచి పోటీ చేసిన ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009లలో సైతం గెలిపొంది హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా బోధన్‌లో రికార్డు నెలకొల్పా రు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజ శేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా మొదటిసారి ఛాన్స్ దక్కగా, కిరణ్‌కుమా ర్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వంలో నీటిపారుదలశాఖ మంత్రి కొనసాగుతున్న తరుణంలో రాష్ట్రపతి పాలనతో మంత్రి పదవిని కోల్పోయారు. దీంతో సుదర్శన్ రెడ్డికి మంత్రి హోదాలో ఆయనకుండే ప్రొటోకాల్ రద్దయిపోతుంది. అయితే మంత్రి పదవికి దూరమైన ఆయన మాత్రం ఎమ్మెల్యేగా కొనసాగుతారు.
పాలనపై అధికార ముద్ర...
రాష్ర్టపతి పాలనకు ఆమోదముద్ర పడటంతో ఇకపై జిల్లా పాలనపై పూర్తిగా అధికార ముద్ర ఉంటుంది. ఇప్పటి వర కు మంత్రి, ఇన్‌చార్జి మంత్రులు, రాజ కీయ నాయకుల కనుసన్నల్లో సాగిన పాలనా వ్యవహారాలన్నీ పూర్తిగా ప్రభుత్వ యం త్రాంగం చూస్తుంది. గవర్నర్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ పూర్తిగా జిల్లా పాలన సాగించనుండగా... రాజకీయ పలుకుబడులు, ఒత్తిళ్లకు ఇకపై బ్రేకులు పడనున్నాయి. జిల్లా పాలనా వ్యవహారాల్లో కలెక్టర్ నిర్ణయమే కీలకం కానుండటంతో ఆయనతో పాటు ఏ జిల్లా ఉన్నతాధికారిపైనా రాజకీయ పెత్తనానికి అస్కారం ఉండదు. అలా గే జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంపైనా అధికార యంత్రాంగానిదే గురుతర బాధ్యత.