అధికారాలు కట్టబెట్టింది సోనియానే: రేవంత్‌రెడ్డి | Powers gave Sonia: revanth reddy | Sakshi
Sakshi News home page

అధికారాలు కట్టబెట్టింది సోనియానే: రేవంత్‌రెడ్డి

Aug 12 2014 1:03 AM | Updated on Oct 22 2018 9:16 PM

అధికారాలు కట్టబెట్టింది సోనియానే: రేవంత్‌రెడ్డి - Sakshi

అధికారాలు కట్టబెట్టింది సోనియానే: రేవంత్‌రెడ్డి

టీఆర్‌ఎస్ నేతలు దేవతగా అభివర్ణించిన సోనియాగాంధీనే గవర్నర్‌కు విశేషాధికారాలు కట్టబెట్టారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోవువారం ఇక్కడ విలేకరులతో వూట్లాడుతూ పేర్కొన్నారు.

హైదరాబాద్: టీఆర్‌ఎస్ నేతలు దేవతగా అభివర్ణించిన సోనియాగాం ధీనే గవర్నర్‌కు విశేషాధికారాలు కట్టబెట్టారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోవువారం ఇక్కడ విలేకరులతో వూట్లాడుతూ పేర్కొన్నారు. ఈ విషయంపై కేసీఆర్‌కు అప్పట్లోనే అవగాహన ఉన్నప్పటికీ ఆనాడే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిం చారు. శాసనసభకు వచ్చిన బిల్లులోనే గవర్నర్ అధికారాల విషయం ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఓ సామాజిక వర్గంపై కక్ష సాధింపు కోసమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వివాదం చేశారని ఆరోపించారు.  అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్‌గాంధీ పేరు మార్చి పీవీనరసింహారావు పేరు పెట్టగలరా? అని రేవంత్ ప్రశ్నించారు. విజయనగరం నుంచి వచ్చిన కేసీఆర్ తెలంగాణకు సీఎం కావచ్చుగాని అక్కడ పుట్టినవాళ్లు ఇక్కడ స్థానికులు కారా? అని  ప్రశ్నించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement