రాజకీయ పార్టీలు దేశాన్ని దోచుకుంటున్నాయి | political parties Exploits the country's | Sakshi
Sakshi News home page

రాజకీయ పార్టీలు దేశాన్ని దోచుకుంటున్నాయి

Mar 6 2016 4:48 AM | Updated on Sep 17 2018 5:36 PM

రాజకీయ పార్టీలు  దేశాన్ని దోచుకుంటున్నాయి - Sakshi

రాజకీయ పార్టీలు దేశాన్ని దోచుకుంటున్నాయి

రాజకీయ పార్టీలు దేశాన్ని దోచుకుంటున్నాయని విప్లవ రచయితల సంఘం నాయకుడు బి కల్యాణ్‌రావు విమర్శించారు.

- విప్లవ రచయితల సంఘం నాయకుడు కల్యాణ్‌రావు

 వేటపాలెం: రాజకీయ పార్టీలు దేశాన్ని దోచుకుంటున్నాయని విప్లవ రచయితల సంఘం నాయకుడు బి కల్యాణ్‌రావు విమర్శించారు. శనివారం స్థానిక గడియార స్తంభం సెంటర్‌లో అమరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అమరులైన  కస్తూరి కుటుంబరావు, ప్రత్పిటి ఆదినారయణ, సజ్జా సూర్యబాలానందం, వేటపాలెం వెంకాయమ్మ, బండారు వెంటేశ్వర్లు, నాయుడు సూర్యచంద్రారెడ్డిలకు నివాళులు అర్పించారు. కల్యాణరావు మాట్లాడుతూ ఓట్లు సాధనంతో వ్యవస్థను మార్చటం అసాధ్యమన్నారు.

విప్లవ పార్టీల నాయకులను ప్రభుత్వం అంత మొందిస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రపంచం మెచ్చే రాజధానిగా నిర్మిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడని ఎద్దేవా చేశారు. మాచర్చ మోహన్‌రావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో చేనేత వృత్తి ఇప్పటి వరక బతికి ఉందంటే అమరైన ఆరుగురి చలవేనన్నారు. కార్యక్రమంలో మద్దు ప్రకాష్, బక్కా జయరామిరెడ్డి, ఊటుకూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement