
వేతనం అడిగితే ఈడ్చేశారు
బ్రాండెక్స్ సెజ్ కార్మికులపై పోలీసులు మరోసారి విరుచుకుపడ్డారు. వేతనాల కోసం ఆందోళనకు సిద్ధమవుతున్న కార్మికులను లాక్కెళ్లి పోలీస్ వ్యాన్లలో పడేశారు.
బ్రాండెక్స్ కార్మికులపై పోలీసుల వీరంగం
అచ్యుతాపురం: బ్రాండెక్స్ సెజ్ కార్మికులపై పోలీసులు మరోసారి విరుచుకుపడ్డారు. వేతనాల కోసం ఆందోళనకు సిద్ధమవుతున్న కార్మికులను లాక్కెళ్లి పోలీస్ వ్యాన్లలో పడేశారు. పోలీసు స్టేషన్లకు తరలించారు. మహిళలని కూడా ఏమాత్రం జాలి లేకుండా ఇష్టం వచ్చినట్లు వ్యహరించారు. ఈ సంఘటనలతో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బ్రాండెక్స్ సెజ్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
విశాఖ జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండెక్స్ సెజ్‌లో పనిచేస్తున్న కార్మికులు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీన్లో భాగంగా ఏప్రిల్ 15న కార్మికులు విధులను బహిష్కరించి ధర్నా చేశారు. యాజమాన్యంతో మూడునాలుగు రోజులపాటు చర్చలు జరిగా యి. 30వ తేదీ లోగా సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు, ప్రజాప్రతిని దుల సమక్షంలో యాజమాన్యం హామీ ఇచ్చింది. ఆ గడువు శనివారం ముగియడం, యాజమాన్యం హామీని నిలబెట్టుకోకపోవడంతో కార్మికులు మళ్లీ ఉద్యమబాట పట్టారు.