కాలర్ పట్టి.. తుపాకీ గురిపెట్టి..! | Pointing a gun to hold the collar .. ..! | Sakshi
Sakshi News home page

కాలర్ పట్టి.. తుపాకీ గురిపెట్టి..!

Apr 16 2014 2:12 AM | Updated on Oct 20 2018 6:17 PM

కాలర్ పట్టి.. తుపాకీ గురిపెట్టి..! - Sakshi

కాలర్ పట్టి.. తుపాకీ గురిపెట్టి..!

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. ఓ కేసు విషయమై స్వాధీనం చేసుకున్న డబ్బు విషయంలో సీఐ, ఎస్‌ఐల మధ్య చోటుచేసుకున్న వివాదం తన్నులాటకు దారితీసింది.

ఎస్‌ఐని బూటుకాలుతో తన్నిన సీఐ చిట్టమూరు ఠాణాలో కొట్లాట
 
 చిట్టమూరు/వాకాడు,  ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. ఓ కేసు విషయమై స్వాధీనం చేసుకున్న డబ్బు విషయంలో సీఐ, ఎస్‌ఐల మధ్య చోటుచేసుకున్న వివాదం తన్నులాటకు దారితీసింది. ఎస్‌ఐ కాలర్ పట్టుకొని విచక్షణారహితంగా కొట్టిన సీఐ.. ఆపై తుపాకీ గురిపెట్టాడు.  ఈ ఘటన మంగళవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిట్టమూరులో చోటుచేసుకుంది.ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా ఈనెల 10న మల్లాం గ్రామసర్పంచ్ సునీల్‌రెడ్డి ఓటర్లకు పంచుతున్న రూ.43వేలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకొని చిట్టమూరు పోలీసులకు అప్పగించారు.

రోజులు గడుస్తున్నా ఈ ఘటన పై ఎస్‌ఐ రవినాయక్ కేసు నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో వాకాడు సీఐ చెంచురామారావు తన కుమారుడు, సోదరుడితో కలసి చిట్టమూరు స్టేషన్‌కు వచ్చారు. క్వార్టర్స్‌లో ఉన్న ఎస్‌ఐని పిలిపించారు. మల్లాం ఘటన నగదు విషయమై కేసు ఎందుకు నమోదు చేయలేదని, ఆ నగదును తనకు స్వాధీనం చేయాలన్నారు. ఈ కేసు ఫైలు ఏఎస్‌ఐ రమణయ్య వద్ద ఉందని, ఆయన వస్తే ఇస్తానని ఎస్‌ఐ సమాధానం ఇచ్చారు. కోపోద్రిక్తుడైన సీఐ.. ఎన్నికల్లో స్వాధీనం చేసుకున్న నగదును ఉంచుకున్న కారణంగా కేసు నమోదు చేస్తానని హెచ్చరించారు. ఇంతలో ఎస్‌ఐ తన రివాల్వర్, డైరీని వరండాలో ఉన్న టేబుల్‌పై పెట్టి లోపలికివెళ్లి వచ్చేలోపు అవి కనిపించలేదు. దాని కోసం గాలిం చగా..  అది ఎస్‌ఐ టేబుల్ డెస్క్‌లో బయటపడింది.

అనంతరం స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్న ఎస్‌ఐని  కాలర్ పట్టుకుని సీఐ లాక్కొచ్చారు. అనంతరం బూటుకాలుతో తన్నారు. సీఐతో పాటు వచ్చిన ఆయన సోదరుడు, కుమారుడు కూడా దాడికి  ప్రయత్నించారు. దీంతో సహనం కోల్పోయిన ఎస్‌ఐ పక్కనే ఉన్న రాయిని సీఐపై విసిరేం దుకు యత్నించారు. కోపోద్రిక్తుడైన సీఐ తన సర్వీసు రివాల్వర్‌ను ఎస్‌ఐ కణతకు గురిపెట్టడంతో అక్కడున్నవారు వారిని విడిపించారు. కాగా, ఈ ఘటనపై గూడూరు డీఎస్పీ చౌడేశ్వరి విచారణకు ఆదేశించారు.  
 
సీఐపై సస్పెన్షన్ వేటు


 ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారితో పాటు సిబ్బందిని అక్రమంగా నిర్బంధించిన ఘటనలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు సీఐ చెంచురామారావును సస్పెండ్ చేశారు. ఈ మేరకు గుంటూరురేంజ్ ఐజీ సునీల్‌కుమార్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement