
తూర్పుగోదావరి :‘ఆశాకార్యకర్తలను ఆదుకోండన్నా’ అంటూ తాటిపాకకు చెందిన ఆశాకార్య ముదపాక విజయ జగన్‌ను కోరింది. పాదయాత్రలో గ్రామానికి వచ్చిన జగన్‌ను కలుసుకుని.. కష్టపడి పని చేస్తున్న తమకు పనికి తగ్గ వేతనం పేరుతో నెలకు కేవలం రూ.వెయ్యి మాత్రమే ఇస్తున్నారని, దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోయింది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆశాకార్యకర్తలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది.