
జగన్ సమక్షంలో పార్టీలో చేరుతున్న పెదిరెడ్డి సురేష్
తూర్పుగోదావరి ,అంబాజీపేట: అన్ని వర్గాలకూ మేలు మేలు కలిగేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలను ప్రజలకు వివరిస్తామని పలువురు నాయకులు అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా సోమవారం కోటనందూరులో జననేత సమక్షంలో టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి పలువురు పార్టీలో చేరారు. తుని నియోజకవర్గ కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో తొండంగి మాజీ సర్పంచ్ పెదిరెడ్డి సురేష్, కోటనందూరుకు చెందిన దంతులూరి శివబాబు, దంతులూరి రాజబాబు, దంతులూరి విష్ణుబాబు, దంతులూరి శ్రీనుబాబులతో పాటు పలువురు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి జగన్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ప్రజలకు మేలు జరగలాంటే జగన్ సీఎం కావాలన్నారు.
ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న పాదయాత్రకు విశేష స్పందన వస్తోందన్నారు. వైఎస్సార్ సీపీకి వస్తున్న ఆదరణను చూసి టీడీపీ నాయకులు ఓర్వలేక లేనిపోని బురద జల్లుతున్నారన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. రాబోయే కాలంలో టీడీపీకి చరమ గీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. గడిచిన నాలుగున్నరేళ్ళ నుంచి టీడీపీ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు చేసినది ఏమీ లేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు మరో సారి ప్రజలను మోసం చేసేందుకు సిద్దమవుతున్నారని, ఆయన మాటలు నమ్మే స్థితిలో ఎవ్వరూ లేరన్నారు. రాష్ట్రాభివృద్ది జననేత జగన్‌కే సాధ్యమన్నారు.