'బెడ్డు'మీదపల్లె | People Suffering With Viral Fevers in Prakasam | Sakshi
Sakshi News home page

'బెడ్డు'మీదపల్లె

Sep 12 2019 12:11 PM | Updated on Sep 12 2019 12:11 PM

People Suffering With Viral Fevers in Prakasam - Sakshi

జ్వరంతో మంచం పట్టిన గడ్డమీదపల్లె ప్రజలు

ప్రకాశం, యర్రగొండపాలెం: విషజ్వరాలతో (వైరల్‌ఫీవర్స్‌) మండలంలోని గడ్డమీదిపల్లె మంచంపట్టింది. వీరభద్రాపురం పంచాయతీలోని ఈ గ్రామంలో అపరిశుభ్రత ఎక్కువగా చోటు చేసుకోవడం వలన అంటువ్యాధులు సోకుతున్నాయి.  పంట పొలాలు గ్రామానికి సమీపంలో ఉండటంతో గ్రామస్తులపై దండయాత్ర చేస్తున్నాయి.   వైద్యాధికారులు సీజనల్‌ వ్యాధులపై ప్రత్యేదృష్టి పెట్టి గ్రామాల్లో తరచూ వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. రోగులను పరీక్షించి మందులను పంపిణీ చేస్తున్నారు. జ్వరాలు సోకిన వారి ఇంటివద్దనే సెలైన్‌ బాటిళ్లు పెడుతున్నారు.  ఈ నేపథ్యంలో గడ్డమీదిపల్లెలో వైరల్‌ ఫీవర్స్‌ ఎక్కువగా ఉన్నాయని తెలుసుకున్న వెంకటాద్రిపాలెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ బి.సురేష్‌ బుధవారం తమ సిబ్బందితో వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించారు. 110 మందిని ఆయన పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. 10 మందికి సెలైన్‌ బాటిళ్లు ఎక్కించారు. గ్రామంలో వైద్యబృదం పర్యటించి కాలువల్లో, గుంతల్లో నిలువ ఉన్న మురికి నీటిలో ఎబేట్‌ పిచికారి చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement