వడ్డీ రాయితీని మింగేస్తున్నారు | People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra | Sakshi
Sakshi News home page

వడ్డీ రాయితీని మింగేస్తున్నారు

Jun 13 2018 7:27 AM | Updated on Jul 26 2018 7:17 PM

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

పశ్చిమగోదావరి : వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో దీర్ఘకాలిక రుణాలపై ఇచ్చే ఆరు శాతం వడ్డీ రాయితీని చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలుపుదల చేసింది. నేటికీ ఆ రాయితీని రైతులకు ఇవ్వలేదు. అలాగే స్వల్పకాలిక రుణాలపై చిన్న, సన్నకారు రైతులకు రూ.లక్ష వరకూ వడ్డీలేదని ప్రభుత్వం ప్రకటించినా అవి ఉత్తర్వుల వరకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం రైతుల నుంచి ఏడు శాతం వడ్డీని ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. వడ్డీ రాయితీలో నాలుగు శాతం కేంద్రం, మూడు శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మూడు శాతం రాయితీని ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నాలుగు శాతం వడ్డీని రైతులకు చేరకుండా రాష్ట్ర ప్రభుత్వం, సహకార బ్యాంకులు కలిసి ఆ సొమ్మును సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నాయి అంటూ.. కొవ్వూరుకు చెందిన సహకార బ్యాంకు రిటైర్డ్‌ మేనేజర్‌ యాళ్ల నరసింహారావు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement