చంద్రబాబు పర్యటనపై స్థానికుల అసంతృప్తి

People Discontent Over Chandrababu Visit To Flood Hit Area - Sakshi

సాక్షి, విజయవాడ : వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటన స్థానికుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు సోమవారం పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు మధ్యాహ్న భోజనం కోసం ఆ పార్టీ శ్రేణులు చేసిన ఏర్పాట్లు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేశాయి. చంద్రబాబు లంచ్‌ కోసం యనమలకుదురు రోడ్డుపై ఆయన బస్సును నిలిపివేశారు. దాదాపు 20 నిమిషాల పాటు వాహనాన్ని రోడ్డుపై నిలపడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో చంద్రబాబు, టీడీపీ నాయకుల తీరుపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top