దేశ ప్రగతిలో సింగరేణీయులు భాగస్వాములు కావాలి | Partners in the House want to singareniyulu | Sakshi
Sakshi News home page

దేశ ప్రగతిలో సింగరేణీయులు భాగస్వాములు కావాలి

Dec 24 2013 4:43 AM | Updated on Sep 2 2018 4:16 PM

దేశ ప్రగతిలో సింగరేణీయులు భాగస్వాములు కావాలని భూపాలపల్లి ఏరియా జీఎం కొమ్మ నాగభూషణరెడ్డి కోరారు.

కోల్‌బెల్ట్, న్యూస్‌లైన్ :  దేశ ప్రగతిలో సింగరేణీయులు భాగస్వాములు కావాలని భూపాలపల్లి ఏరియా జీఎం కొమ్మ నాగభూషణరెడ్డి కోరారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఉదయం గనులు, డిపార్ట్‌మెంట్ల వద్ద సంబంధిత గని అధికారులు కంపెనీ పతాకాలను ఆవిష్కరించారు. సాయంత్రం స్థానిక అంబేద్కర్ స్టేడియంలో సాంస్కృతికి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి కంపెనీ భూగర్భంలోని బొగ్గు నిక్షేపాలను వెలికితీస్తూ దేశాని కి వెలుగులు పంచడమే కాకుండా అనేక పరిశ్రమలకు తోడ్పాటునందిస్తూ దేశ అభివృద్ధికి సహకరిస్తోందని చెప్పారు. సంస్థ ముందున్న లక్ష్యాలను అధిగమిస్తూ కార్మికులు, కుటుంబీ కులు సహకరించాలని కోరారు. రానున్న కాలం లో భూపాలపల్లి ఏరియాలో మరో 4 నూతన గనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు ఏరియా ఉత్పత్తి లక్ష్యం 24.81 లక్షల టన్నులు కాగా 14.72 లక్షల టన్నులు మాత్రమే సాధించామని, ఉత్పత్తి పెంపు కోసం ప్రతీ కార్మికుడు కృషి చేయాలన్నారు.

ఇందుకోసం ఉద్యోగులకు ప్రోత్సాహక బహుమతుల ను యాజమాన్యం ప్రకటించిందని తెలిపారు. రక్షణ పరంగా కంపెనీ తగిన చర్యలు తీసుకుం టున్నా అజాగ్రత్త, రక్షణ సూత్రాలను పాటించకపోవడం వల్ల తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నివారించాల్సిన బాధ్యత కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. సింగరేణి పరిసర గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించి కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. యువకులు, మహిళలకు వృత్తి విద్యాకోర్సుల్లో సేవా సమితి ద్వారా శిక్షణ ఇస్తున్నామని, ఇప్పటి వరకు వివి ధ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసిన 121 మందికి సర్టిఫికెట్లు అందజేశామని పేర్కొన్నారు.

ఏరి యాలోని అన్ని కాలనీలకు త్వరలోనే గోదావరి జలాలు అందిస్తామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ఈ ఏడాది 100 హెక్టార్లలో మొక్క ల పెంపకం చేపట్టినట్లు వివరించారు. అనంత రం ఉత్తమ సేవా సభ్యులుగా ఎంపికైన సీహెచ్ విజయలక్ష్మి, ఎస్.నర్మద, ఉత్తమ స్వయం ఉపాధి మహిళ జి.అరుణ, ఉత్తమ స్వయం ఉపాధి యువకుడు కె.రాజ్‌కుమార్‌లను సన్మానించారు.

అనంతరం పట్టణంలోని మాంటిస్సోరీతోపాటు వివిధ పాఠశాలల విద్యార్థులు, సింగరేణి కార్మికులు చేసిన నృత్యాలు ఆహూతు లను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏరియా ఎస్‌ఓటూ జీఎం రాంచంద్రం, అధికారులు ఎ.కుమార్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్, శ్రీనివాసరావ్, అప్పారావ్, శంకర్, గంగయ్య, గుర్తింపు సం ఘం బ్రాంచ్ ఉపాధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్, మనోజ్‌కుమార్, సంపత్‌రావ్, బాబుమియా, ఎన్.రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఏరియాలో నిర్వహించిన సింగరేణి డే వేడుకలు జనం లేక వెలవెలబోయాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement